చిరస్థాయిగా నిలిచే ప్రజాకవిత్వం
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:27 PM
సమాజంలో ఎన్ని రకాల కవిత్వాలు పుట్టుకొచ్చినా, ప్రజా కవిత్వమే చిర స్థాయిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు.
- ఎమ్మెల్సీ, గోరటి వెంకన్న
- ‘ రేపటి కాలం’ పుస్తకావిష్కరణ
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో ఎన్ని రకాల కవిత్వాలు పుట్టుకొచ్చినా, ప్రజా కవిత్వమే చిర స్థాయిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కవి ఎదిరెపల్లి కాశన్న రచించిన ‘రేపటి కాలం’ కవితల పుస్త కాన్ని సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సి పాల్ ప్రొఫెసర్ కాశీంతో కలిసి ఆవిష్కరిం చారు. కవి సంగమం వ్యవస్థాపకుడు, కవి యాకుబ్ సభకు అధ్యక్షత వహించి రేపటి కాలం పుస్తకాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ సమ కాలీన సమాజపు అలజడులకు చలించిన రచ యిత కాశన్న గుండె లోతుల్లో నుంచి పద్యమై పలికారన్నారు. అసమానతలు, డోపిడీ, అధర్మం, మతోన్మాదం, కుల వెలివేతలను ధిక్కారంగా వినిపించాడని ప్రశంసించారు. మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్, జాతిపిత మహాత్మాగాంధీ, అంబేడ్కర్, మహాత్మా జ్యోతి రావు ఫూలే, ప్రజా హక్కుల ఉపాధ్యాయుడు బాల జంగయ్యలపై స్మృతి కవిత్వం రాసి అభ్యుదయంగా నిలిచారని కొనియాడారు. కందనూలు జిల్లా నుంచి చాలా మంది మిత్రులు కవిత్వంలోకి రావడం అభినందనీ యమన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తిగుళ్ల గోపాల్, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంక టేశ్వర్‌రెడ్డి, కవి, విమర్శకులు సామిడి జగన్ రెడ్డి, చింతలపల్లి భాస్కర్‌రావు, నాగవరం బాల్‌రాం, వనపట్ల సుబ్బయ్య, కందికొండ మోహన్, రమేశ్‌బాబు, కల్వకోలు మద్దిలేటి, గుడిపల్లి నిరంజన్, ముచ్చర్ల దినకర్, పి.వహీ ద్‌ఖాన్, కూరాకుల ఆంజనేయులు, ఎండీ.ఖా జా, బాలస్వామి పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 11:27 PM