ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి పనుల వివరాలు సిద్ధం చేయాలి

ABN, Publish Date - Apr 10 , 2025 | 11:20 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించిన పూర్తి వివరా లు, రిజిస్టర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

అధికారులకు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ సంతోష్‌

గద్వాలన్యూటౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించిన పూర్తి వివరా లు, రిజిస్టర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ సమావేశపుహాలులో ఉపాఽ ది హామీ పథకం కింద చేపట్టే పనులపై అధికారులకు జిల్లాస్థాయి ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ ప నులు పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. ఆర్ధిక సంవత్సరం ప్రారంభం లో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబిలైజ్‌ చేయాలని, వంద రోజుల పనిదినాలు కల్పించాలని సూచించారు. ప్రతీ పనికి సంబంధించిన అన్ని రిజిస్టర్లు, ప్రాథమిక రికార్డులను సిద్ధం చేయాలని చెప్పారు. మూడు సంవత్సరాల ప నుల వివరాలు, సంవత్సరాల వారీగా, ప్రతీ పని పూర్తిఅయ్యిందా.. లేదా పెండింగ్‌లో ఉందా అనే వివరాలు పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండాలన్నారు. ప్రతీ పనికి సంబంధించిన అంచనాలు సక్రమంగా రూపొందించాలని, వాటిపై కార్యదర్శులకు పూర్తి అవగాహనఉండాలన్నారు. తోటలు, చెరువులు, నీటినిల్వలు, రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కూలీరేటు రూ.300 నుంచి రూ.307లకు పెంచినట్లు తెలిపారు. ఈనెల 20నుంచి క్షేత్రస్ధాయిలో పర్యటిం చినప్పుడు రిజిస్టర్ల తనిఖీ ఉంటుందని చెప్పా రు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇందిర మ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైనవారికి మాత్రమే ఎంపిక చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్‌ యువ వికాస కార్యక్రమాన్ని యువత అభివృద్దికి ప్రభావవంతంగా అమలుచేయాలని ఆధికారులకు ఆదేశించారు. జిల్లాలోని గట్టు, కేటిదొడ్డి, మల్దక ల్‌మం డలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా ఉన్నందు న, ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, ఇన్‌చార్జి డిపీవో నాగేం ద్రం, అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:20 PM