ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులను ఎంపిక చేయాలి

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:23 PM

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పక డ్బందీగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.

ఎంపీడీవోలు, బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించాలి

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పక డ్బందీగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హా ల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌తో కలిసి ఎంపీడీవోలు, బ్యాంకర్లతో రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు, అర్హుల ఎం పికపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయిలో దరఖాస్తులను ఎంపీడీవోలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పరిశీలిం చాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, దివ్యాంగులను లబ్ధిదారులుగా ఎం పిక చేయాలని సూచించారు. లబ్ధి దారులకు రుణం మంజూరు చేసే ముందు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ఒకే గ్రా మంలో ఎక్కువమందికి ఒకే రకమైన యూనిట్లు పెట్టే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనివల్ల వ్యాపారంలో పోటీ పెరిగి నష్టాలు వస్తాయన్నారు. సరైన లబ్ధిదారుల ఎంపికలో పారదర్శక త పాటించాలన్నారు. వయస్సు, కులం, ఆదాయం, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆమె సూచించారు. ఎంపికైన యూనిట్లకు సంబంధించిన గ్రౌండింగ్‌ పూర్తయిందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే పైఅధికారులను సంప్రదించాలన్నారు. ఈనెల 25 వరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్డీవో మొగులప్ప, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అ బ్దుల్‌ఖలీల్‌, మైనార్టీ సంక్షేమ అధికారి ఎంఏ.ర షీద్‌, ఇండస్ర్టీస్‌ జీఎం భరత్‌రెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ విజయ్‌కుమార్‌, అన్ని మండలాల ఎంపీడీవోలు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:23 PM