డెంగీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
ABN, Publish Date - May 16 , 2025 | 11:43 PM
గద్వాల జిల్లాను డెంగీ రహిత జి ల్లాగా మార్చేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు.
గద్వాలలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప
గద్వాల న్యూటౌన్, మే 16 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాను డెంగీ రహిత జి ల్లాగా మార్చేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ దినం సందర్బంగా జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వైద్యాధికారు లు, వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డీఎం హెచ్‌వో డాక్టర్ సిద్దప్ప జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... డెంగీ వ్యాధి మన ఇంటిలోపల తిరిగే ఈడీస్ ఈజిప్టి అనే దోమ కుట్టుడం వల్ల ఆర్బోవైరస్ మన శరీరంలో ప్రవేశించడంతో వస్తుందన్నారు. ఈ దోమ పగటిపూట ఎక్కువగా కుడుతుందని, మళ్లీ మళ్లీ కుట్టే స్వభావం ఉండటం వలన ఇం టిలోని ఒకరికంటే ఎక్కువ మందికి ఈ డెంగీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. వీటి నివారణకై ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉం చడంతో పాటు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, అర్బన్‌హెల్త్ సెంటర్ హెల్త్ సిబ్బంది ఉన్నారు.
Updated Date - May 16 , 2025 | 11:43 PM