ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధికి కృషి

ABN, Publish Date - May 11 , 2025 | 11:26 PM

పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గాన్ని అభినందిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గానికి అభినందనలు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మే 11 (ఆంధ్రజ్యోతి) : పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 6న ఎన్నికైన ఇండిపెండెంట్‌ ప్యానల్‌ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలవగా, నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌కు కావల్సిన మౌలిక సదుపాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్టులకు గతంలో మౌలాలి గుట్ట వద్ద పట్టా సర్టిఫికెట్‌ ఇచ్చిన వారికి నెంబర్లు కేటాయించి, ఇళేకల అలాట్‌ చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో భవనానికి కావల్సిన ఎస్టిమెట్‌ తయారు చేయించాలని సూచించారు. ప్రెస్‌క్లబ్‌ ఆవరణలో కొత్తగా బోరు వేయాలని కోరగా ఒకటి, రెండు రోజుల్లో వేయిస్తానని, దీంతోపాటు ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి ప్రెస్‌క్లబ్‌ వేదికగా మీట్‌ది ప్రెస్‌, ప్రెస్‌మీట్‌లు నిర్వహించేలా నూతన కమిటీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాజకీయాలతీతంగా మహబూబ్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌కు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా ప్రెస్‌క్లబ్‌ కమిటీ పని చేయాలన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నరేందర్‌చారి, ప్రధాన కార్యదర్శి నరేందర్‌గౌడ్‌, కోశాధికారి పల్లెమోని యాదయ్య, ఉపాధ్యక్షుడు చింతకాయల వెంకటేష్‌, అక్కాల ధరణికాంత్‌, సంయుక్త కార్యదర్శులు సతీష్‌కుమార్‌, కృష్ణ, మణిప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు గడ్డం రవికుమార్‌, రామ్‌కొండ, షాబూద్ధిన్‌, అబ్దుల్‌ అహాద్‌ సిద్ధికి, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్‌చార్జి నోముల రవీందర్‌రెడ్డి, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి కిషోర్‌, నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జి వెంకటేశ్వర్‌రావు, సూర్య బ్యూరో ఇన్‌చార్జి శివకుమార్‌, మనతొలి వెలుగు బ్యూరో ఇన్‌చార్జి మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:26 PM