ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాలు జీవితానికి ప్రమాదకరం

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:47 PM

సర దాగా మొదలయ్యే చెడు అలవాట్లు వ్యసనా లుగా మారి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తాయని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

  • జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సర దాగా మొదలయ్యే చెడు అలవాట్లు వ్యసనా లుగా మారి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తాయని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మాద కద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమ ని, యువత ముఖ్యంగా విద్యార్థులు అర్థం చేసు కోవాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, మా నవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాల సం దర్భంగా గత నెల 26న నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు గురువారం పట్టణంలో ని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ చేతుల మీదుగా ధ్రువపత్రాలు, బహుమతులు అందజే శారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెంది న విజేతలైన విద్యార్థులను అభినందించిన ఎస్పీ, విద్యావంతులైన యువతీయువకులు మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు.కాగా, దేశ జనాభాలో 70శాతంగా ఉన్న యువతను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్‌, ఆఫ్గానిస్తాన్‌, టర్కీ, మయన్మార్‌, థా య్‌లాండ్‌, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి డ్ర గ్స్‌ను అక్రమంగా రవాణా చేయడం పెద్ద కు ట్రగా జరుగుతున్నట్లు ఎస్పీ వివరించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌బాష మాట్లాడు తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మ హిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మీనాక్షి, యాంటీ డ్రగ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కరుణాకర్‌, అధ్యా పకులు, పోలీసు అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:47 PM