అనుమానమే పెనుభూతం
ABN, Publish Date - May 22 , 2025 | 10:55 PM
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ్‌లో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నవ వధువు కేసును పోలీసులు చేధించారు. భర్తే గొంతు నులిమి చంపినట్లు వెల్లడించారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య గురువారం మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు.
భార్యను గొంతు నులిమి చంపిన భర్త
పెళ్లయిన నెలకే ఘాతుకం
మిస్టరీని ఛేదించిన పోలీసులు
మద్దూర్, మే 22 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ్‌లో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నవ వధువు కేసును పోలీసులు చేధించారు. భర్తే గొంతు నులిమి చంపినట్లు వెల్లడించారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య గురువారం మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. ఎక్కమేడ్ గ్రామానికి చెందిన స్వామికి కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పూజ(20)తో గత ఏప్రిల్ 20న వివాహం జరిగింది. కొన్ని రోజులు ఇరువురు బాగానే ఉన్నారు. పది రోజుల క్రితం పూజ తల్లి గారి ఊరు మల్కాపూర్‌కు వెళ్లి, ఈ నెల 14న ఎక్కమేడ్ వచ్చింది. 18న రాత్రి నిద్రిస్తున్న క్రమంలో కడుపు నొప్పితో పూజ మృతి చెందని భర్త స్వామి కుటుంబ సభ్యులకు తెలిపాడు. స్వామి కుటుంబ సభ్యులు పూజ తండ్రి కుశలయ్యకు తెలిపారు. కుశలయ్య, కుటుంబ సభ్యులు ఎక్కమేడ్‌కు వచ్చి, పూజ మెడపై ఉన్న గాయాన్ని చూసి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 19న మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. కుశలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ సైదులు, ఎస్‌ఐ వియ్‌కుమార్ భర్త స్వామిని అదుపులో తీసుకొని విచారించారు. పుట్టినింటి నుంచి వచ్చాక భార్య పూజ తనకు దూరంగా ఉంటుందని స్వామి చెప్పాడన్నారు. 18న రాత్రి దగ్గరికి రానివ్వకపోవడం వెరొకరితో సంబంధం ఉన్నందునే తనను కలువనివ్వడం లేదని గుంతునులిమి చంపినట్లు నేరం ఒప్పుకున్నాడని చెప్పారు. స్వామిని గరువారం రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను డీఎస్పీ లింగయ్య అభినందించారు.
Updated Date - May 22 , 2025 | 10:55 PM