ఒత్తిడికి గురికావొద్దు: కలెక్టర్
ABN, Publish Date - Mar 17 , 2025 | 10:42 PM
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, అప్పుడే మంచి ఫలితం వస్తుందని కలెక్టర్ విజయేందర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆమె ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, అప్పుడే మంచి ఫలితం వస్తుందని కలెక్టర్ విజయేందర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆమె ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఇస్తున్న ఏఐ శిక్షణను పరిశీలించారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. నాలుగు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఎలా చదివారని అడిగారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని, భయం వద్దని సూచించారు. ఫస్ట్ క్లాస్ వచ్చినా, పాస్ అయినా పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. పరీక్షలు పూర్తయిన తరువాత సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, మంచి పుస్తకాలు చదవాలని సూచించారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఏం చేద్దామనుకుంటారు? అని బాలికలను ప్రశ్నించారు. కొందరు ఎంపీసీ, మరి కొందరు బైపీసీ తీసుకుంటామని చెప్పారు. బాలురు ఏం చెప్పడం లేదు? ఎందుకు? అని అడుగగా కొందరు మాత్రం ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ.. బాలికలు చురుకుగా సమాధానం ఇస్తుంటే బాలురు మాత్రం డల్‌గా ఉన్నారు.. వీరికి కెరియర్ గైడెన్స్ ఇవ్వలేదా? అని అక్కడే ఉన్న డీఈవో, ప్రధానోపాధ్యాయులను అడిగారు. ఇప్పించాం మేడం అని వారు చెప్పారు. విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. డీఈవో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు బైకాని బాలు యాదవ్, దుంకుడు శ్రీనివా్‌సలు, ఎంఈవో లక్ష్మణ్ సింగ్, ప్రఽధానోపాధ్యాయులు జయశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Mar 17 , 2025 | 10:42 PM