ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దు

ABN, Publish Date - May 26 , 2025 | 11:09 PM

నకిలీ విత్తనాలు, నిషేధిత బీజీ-3 రకం పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం రైతులకు సూచించారు.

జడ్చర్లలోని సీడ్స్‌దుకాణంలో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ బృందం

- సీడ్స్‌ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీలు

జడ్చర్ల/మిడ్జిల్‌/రాజాపూర్‌/నవాబ్‌పేట/చిన్నచింతకుంట, మే 26 (ఆంధ్రజ్యోతి) : నకిలీ విత్తనాలు, నిషేధిత బీజీ-3 రకం పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం రైతులకు సూచించారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ ఏవో శ్రీనివాస్‌, గండీడ్‌ ఏవో రాంపాల్‌, జడ్చర్ల ఏవో గోపీనాథ్‌, జడ్చర్ల ఎస్‌ఐలు జయప్రసాద్‌, ఖాదర్‌తో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందం సోమవారం జడ్చర్ల పట్టణంలోని సీడ్స్‌ దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్‌ బిల్లులు, ఇన్వాయిస్‌లు, రైతులకు అందుబాటులో ఉంచిన విత్తనాలు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా మిడ్జిల్‌ మండల కేంద్రంతో పాటు రాణిపేటలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారి శృతి, ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు, ఏవో సిద్ధార్థ, పోలీస్‌ సిబ్బంది నారాయణరెడ్డి, వెంకటేష్‌, ఏఈవో గౌస్‌పాషా తనిఖీ చేశారు. రాజాపూర్‌ మండల కేంద్రంతో పాటు ఇద్గాన్‌పల్లి, కల్లెపల్లి, రంగారెడ్డిగూడ గ్రామాల్లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో ఎస్‌ఐ శివానందం, టాస్క్‌ఫోర్స్‌ అధికారి అనిల్‌కుమార్‌ తనిఖీ నిర్వహించారు. నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన కేంద్రాలను బాలనగర్‌ ఏవో సుజాత, హన్వాడ ఎస్‌ఐ వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపులను సోమవారం ఎస్‌ఐ రాంలాల్‌నాయక్‌, ఏఓవో నరేందర్‌ తనిఖీ చేశారు.

Updated Date - May 26 , 2025 | 11:09 PM