ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:07 PM

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు.

దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

పాలమూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. గురువారం మ హబూబ్‌నగర్‌ మునిసి పాలిటీ పరిధిలో ఎ దిరలో దొడ్డికొమరయ్య విగ్రహాన్ని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దొడ్డికొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. దొడ్డికొమరయ్య స్ఫూర్తితో గ్రామా ల్లో ప్రజలు వెట్టిచాకిరి విముక్తి కోసం ఉద్యమబాట పట్టారన్నారు. అనంత రం రూ.50 లక్షలతో నిర్మించనున్న కురుమ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మె ల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, క్యా మ మల్లేష్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, హన్మంతు, శ్రీశైలం, జేపీఆర్‌, కోస్గి శివప్రసాద్‌, చర్ల శ్రీనివాసులు, రాములు, బుచ్చన్న, కర్నె కృష్ణయ్య, గ్యాస్‌ అంజి, కుర్వ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.నర్సింహులు, సంయుక్త కార్యదర్శి ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్లు యాదమ్మ, శివశంకర్‌ పాల్గొన్నారు.

కులవృత్తులు బాగుపడితేనే అభివృద్ధి: మాజీ మంత్రి

కులవృత్తులు బాగుపడితేనే కులాలకు చెందిన వారు అభివృద్ధి అవుతారని మాజీ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం ఎదిరలో దొడ్డి కొ మరయ్య విగ్రహావిష్కరణకు హాజరై మాట్లాడారు. వృత్తి మనదే కాని అభివృద్ధి చెందకపోతే ఉపయోగం లేదన్నారు. నేటి ప్రభుత్వం కురుమలు అభివృద్ధికి స హకారం ఈరోజు కాకపోయినా రేపు అయినా చేస్తుందన్నారు. బీసీలకు 42 శా తం రిజర్వేషన్‌ వస్తేనే అందరికి మేలు జరుగుతుందన్నారు. గతంలో మేమిచ్చి న ఎకరం భూమి, నేడు భవన నిర్మాణం చేసుకోవాలన్నారు. దొడ్డికొమరయ్య, ఐలమ్మ, పండుగ సాయన్నను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:07 PM