అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
ABN, Publish Date - Jun 15 , 2025 | 11:18 PM
ప్రధాని మోడీ 11ఏళ్లలో చేసిన అభివృద్ది గురించి నాయ కులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరుగూ ప్రజ లకు వివరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి రవికుమార్ ఎగ్బోటే అన్నారు.
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే
మల్దకల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోడీ 11ఏళ్లలో చేసిన అభివృద్ది గురించి నాయ కులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరుగూ ప్రజ లకు వివరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి రవికుమార్ ఎగ్బోటే అన్నారు. వికసిత్ భా రత్ అమృతకాలం సేవ సుపరిపాలన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా ఆదివారం మల్దకల్ మండలంలో బీజేపీ మండల అధ్యక్షు డు తిరుపతిరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై భవిష్యత్ కార్యాచరణ గురించి కార్యకర్తలకు వివరించారు. అం తకుముందు నాయకులు లక్ష్మీతులసి మొక్కను నాటారు. అలాగే ఈ నెల 21న యోగాడే, 23న పార్టీ కార్యక్రమం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ గురించి, 25న రాజ్యాంగ దివస్ గురించి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించా రు.వికసిత్ భారత్‌లో భాగంగా దేశం, రాష్ట్రంలో పేదలు, రైతులకే చేసిన సేవలను వివరించాల న్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమా లు అన్ని మండల కేంద్రాలతో పాటు బూత్‌స్థా యిలో కూడా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకు లు దామ నాగరాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఏవీ రెడ్డప్ప, వెంకటేష్, వీరన్న గౌడ్, వాసురెడ్డి, కిశోర్, శివప్రసాద్, బలరాం, రమేష్, రాజశేఖర్, శేఖర్ ఉన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 11:18 PM