ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:29 PM

నా హయాంలో నర్వ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అగ్రగామిగా మారుస్తానని పశుసంవర్ధక, మత్స్య, క్రీ డా మైదానాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌ అందజేసిన మంత్రి, అదనపు కలెక్టర్‌

- ప్రత్యేకంగా నర్వ మండలానికి రూ.150 కోట్ల నిధులు

- పశుసంవర్ధక, మత్స్య, క్రీడా మైదానాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

నర్వ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : నా హయాంలో నర్వ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అగ్రగామిగా మారుస్తానని పశుసంవర్ధక, మత్స్య, క్రీ డా మైదానాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ మారుమూల నర్వ మండలానికి 150 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యం నాది అని పే ర్కొన్నారు. గురువారం నర్వ మండల పర్యటనలో భాగంగా ఎంపీడీవో కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 70 కోట్ల నిధులతో మంత్రి గా నర్వకు వచ్చానన్నారు. ప్రస్తుతం బేస్‌మెంట్‌ లెవల్‌ అయిన ఇండ్లకు లక్ష రూపాయల చెక్కులను అందజేశామని ఆయన అన్నారు. ప్రస్తుతం 130 మం ది లబ్ధిదారుల కు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇ చ్చారని తెలిపారు. అంతకంటే ముందు మండల కాంగ్రెస్‌ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా ఊరు బయట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అ నంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కురువ సంఘం ఆధ్వర్యం లో మంత్రికి గొర్రె పొట్టెలును బహుమతిగా ఇచ్చి మెడపై గొంగళి వేసి సన్మా నించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ మాట్లాడారు. జడ్పీ సీఈవో శైలేష్‌, పీడీ హౌసింగ్‌ శంకర్‌, డీఈ హరికృష్ణ, తహసీల్దార్‌ మల్లారెడ్డి, రాంకోటి ఎంపీడీవో శ్రీనివాసులు, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రఘురాం, శివంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్‌, కాంగ్రెస్‌ నాయ కులు పోలీసు చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, జగదాబిరామి రెడ్డి, మాదిరెడ్డి రవీందర్‌రెడ్డి, వివేకవర్దన్‌ రెడ్డి, శరణప్ప, మండల యూత్‌ అ ధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌, నర్వ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి, బోయపాటి నరసింహ, ముష్టిపల్లి శ్రీకాంత్‌ ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:29 PM