ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాల కేంద్రంలో నృత్య దినోత్సవం

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:11 PM

భారతీయ ప్రముఖ చిత్రకారుడు రాజరవి వర్మ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

బాల కేంద్రంలో నృత్య దినోత్సవ వేడుకల్లో చిన్నారులు

మహబూబ్‌నర్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : భారతీయ ప్రముఖ చిత్రకారుడు రాజరవి వర్మ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేంద్రం పర్యవేక్షకులు రాజేష్‌ కన్న మాట్లాడుతూ రాజరవి వర్మ జయంతిని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతందన్నారు. భారతీయ సాంప్రదాయ, జానపద నృత్యాల విశిష్టతను సమాజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా నేటి తరం పిల్లలకు నృత్య కళలు నేర్చించాల్సిన బాధ్యత తల్లితండ్రలపై ఉందన్నారు. దివ్య, హైందవి, సంగీత శిక్షకులు సరోజ, వెంకటేశ్వరమ్మ, గజేంద్ర, సునిత పాల్గొన్నారు.

నృత్యకారులకు సన్మానం

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సుశృత హాస్పిటల్‌లో సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రసిద్ధ నృత్యకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక చైతన్యంలో నృత్య ప్రదర్శన ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లాకు చెందిన ప్రసిద్ధ నృత్యకారులు చంద్రశేఖర్‌, అజీమ్‌, మౌనిక, తిరుపతి రాజు, స్వాతి, విజయ, సాయికమలను సన్మానించారు. ఐద్వా జిల్లా అఽధ్యక్షురాలు పద్మ, కురుమూర్తి, రాము, ప్రమోద్‌, భరత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:11 PM