ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుస్తకాల విక్రయంపై ముదురుతున్న వివాదం

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:37 PM

అయిజ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో విక్రయిస్తున్న పుస్తకాల విక్రయాల వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. విద్యార్థి సంఘాల ఆందోళనతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తక విక్రయ కేంద్రాలను అధికారులు సీజ్‌ చేశారు.

అయిజ టౌన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): అయిజ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో విక్రయిస్తున్న పుస్తకాల విక్రయాల వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. విద్యార్థి సంఘాల ఆందోళనతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తక విక్రయ కేంద్రాలను అధికారులు సీజ్‌ చేశారు. తీవ్ర వాగ్వాదాల మధ్య ఈ ఘటన శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌కు చేరిం ది. పట్టణంలోని మరో ప్రైవేటు పాఠశాల వారు ఓ ప్రైవేటు దుకాణంలో పుస్తకాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో శుక్రవా రం విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చే రుకున్నారు. విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కార్యాలయ సిబ్బందిని పంపి న ఎంఈవో, కొంత సమయం తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యంతో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నే కృష్ణవేణి పాఠశాల బస్సు డ్రైవర్లు కొందరు అక్కడికి వచ్చి మేము తాగి వాహనాలు నడుపున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని విద్యార్థి సంఘాల నాయకులను ప్రశ్నించారు. ఈ క్ర మంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అస భ్యకరమైన పదజాలంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంఈవో కార్యాలయ సిబ్బంది సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది. తమపై పాఠశాల యాజమా న్యాలు దాడులకు ప్రోత్సహిస్తున్నాయని పోలీసు లకు ఫిర్యాదు చేశామని ప్రగతిశీల విద్యార్థి యువజన సంఘం జిల్లా కార్యదర్శి హరీశ్‌ తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 11:37 PM