ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డాక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:21 PM

హైదరాబాద్‌లోని నీలోఫర్‌ హాస్పిటల్‌ హెచ్‌ వోడీ డాక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి గురువారం ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ధరూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని నీలోఫర్‌ హాస్పిటల్‌ హెచ్‌ వోడీ డాక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి గురువారం ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, ఆయన మృతదేహాన్ని ధరూర్‌ మండల పరిధి లోని గార్లపాడు గ్రామంలో శుక్రవారం కుటుం బసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకు ని గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి దివంగత డాక్టర్‌ గార్లపాడు సర్వే శ్వర్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలే వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ స భ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూ తి తెలిపారు. అలాగే ధరూర్‌లోని రఘువర్ధన్‌ తల్లి తెలుగు గోవిందమ్మ అనారోగ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వా రి ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి, సీతారాం రెడ్డి, మాజీ సర్పం చు రఘువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రఘువర్ధన్‌రెడ్డి, వంట భాస్కర్‌, హనుమంతు, దౌలు, రామకృష్ణ, వెంకట్రాములు, పరశు రాము డు కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:21 PM