గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:18 PM
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.
బాలానగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మోతీఘనపూర్‌లో రూ.50 లక్షల ముడా నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లను భూమి పూజ నిర్వహించి, మాట్లాడారు. గ్రామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, నగరాలకు దీటుగా అభివృద్ధి చేయడమే ధ్యేయం అన్నారు. ఈ సందర్భంగా పెద్దబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలో జడ్పీ రోడ్డు నుంచి గౌతంపల్లితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల జ్యాప్యంపై తిరుమలగిరి నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, రోడ్డు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆదిరమణారెడ్డి, కేఎస్‌ఆర్ వెంకట్‌రెడ్డి, వెంకటే శ్వర్‌రెడ్డి, నందీశ్వర్, నవీన్‌యాదవ్, రఫీక్, రమేష్‌యాదవ్, కురువశ్రీను, మహేష్‌యాదవ్, శ్రీనివాస్‌నాయక్, మాజీ వార్డు సభ్యులు రవీంద ర్‌నాయక్, పూల్యానాయక్, శ్రీనాథ్‌నాయక్, వీరేందర్‌నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
జడ్చర్ల/మిడ్జిల్ : జడ్చర్ల మండలం గోప్లాపూర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రారంభించారు. ముడా నిధులు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ రాధిక భర్త బీఆర్‌ఎస్ నాయకుడు వెంకట్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
Updated Date - Jul 02 , 2025 | 11:18 PM