ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుణాత్మక విద్య కోసం విధిగా శిక్షణ పొందాలి

ABN, Publish Date - May 12 , 2025 | 11:24 PM

విద్యా ర్థులకు గుణాత్మక విద్యనందించే లక్ష్యంగా ఏ ర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ప్రతి ఉపా ధ్యాయుడు విధిగా హాజరుకావాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్‌ ఘని సూచించారు.

జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్‌ ఘని

గద్వాల టౌన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులకు గుణాత్మక విద్యనందించే లక్ష్యంగా ఏ ర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ప్రతి ఉపా ధ్యాయుడు విధిగా హాజరుకావాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్‌ ఘని సూచించారు. శిక్షణ ద్వారా లభించే నైపుణ్యం, విద్యాబోధనకు ఉపకరించేలా తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవా లన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందు కోసం రాష్ట్రస్థాయిలో ఇప్పటికే శిక్షణ పొందిన డీఆర్‌పీ (డిస్ర్టిక్‌ రీసోర్స్‌ పర్సన్‌)లతో సోమవారం పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉ న్నత పాఠశాలలో సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా మాట్లాడిన డీఈవో, సబెక్టుల వారీగా శిక్షణనిచ్చేందుకు డీఆర్‌పీలుగా నియమితులైన వారు తమకు కేటాయించిన కేంద్రాల్లో సంబంధిత ఉపాధ్యాయులందరికీ బో ధనపై మరింత స్పష్టతనివ్వాలన్నారు. పట్టణం లోని ప్రభుత్వ అభ్యసన, బాలికల, ప్రభుత్వ ఉ న్నత పాఠశాల, జ్ఞానప్రభ జూనియర్‌ కళాశాల కేంద్రాలుగా గణితం, సోషల్‌, ఇంగ్లిష్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌తో పాటు ఎస్టీటీలకు ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు.

Updated Date - May 12 , 2025 | 11:24 PM