కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కమిటీలు
ABN, Publish Date - May 22 , 2025 | 11:01 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా పార్టీని గ్రామ స్థాయిలో బలో పేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి
నర్వ/మాగనూరు/ మక్తల్/ఊట్కూర్, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా పార్టీని గ్రామ స్థాయిలో బలో పేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని పార్టీ నాయకుడు జలంధర్‌రెడ్డి ఇంటి ఆవరణలో మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ అధ్యక్షతన నర్వ మండలంలోని గ్రామాల్లో కొత్త కమిటీల ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీపీసీసీ పరిశీలకుడు వేణుగౌడ్, సంధ్యారెడ్డితో పాటు, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. పార్టీ పదవుల నియామకం పారదర్శకంగా జరగాలనే ఉద్ధేశంతో మండల అధ్యక్ష పదవి, గ్రామ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని వారు తెలిపారు. వచ్చిన వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అధిష్టానానికి పంపిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పదవులు దక్కని వారికి వచ్చే స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం అధ్యక్ష పదవులకు పోటీ పడే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో కాం గ్రెస్ పార్టీ నర్వ మండల యూత్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు రాధ, కొత్తకోట సిద్ధార్థ్‌రెడ్డి, జగదాబిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మాదిరెడ్డి రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, వివేకవర్ధన్‌రెడ్డి, శరణప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా, మాగనూరు మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మాగనూరు, కృష్ణ మండలాల కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, ఇన్‌చార్జి సంధ్యారెడ్డి, వేణుగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. అనంతరం మండల, గ్రామ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మాగనూరు, కృష్ణ మండలాల అధ్యక్షులు ఆనంద్‌గౌడ్, రాజప్పగౌడ, నాయకుడు కొత్తకోట సిద్దార్థరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, డబ్బా రాములు, శివరాంరెడ్డి, విజయగౌడ, మాజీ సర్పంచు విజయగౌడ తది తరులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే వారే నామినేషన్ వేయాలని అన్నారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు వెంకటేష్‌గౌడ్, సంధ్యరాణిలు మా ట్లాడారు. సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం జిల్లా ఇన్‌చార్జిలు సంధ్యారెడ్డి, వేణుగౌడ్‌ల ఆధ్వర్యంలో పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కొత్తకోట సిద్దార్థరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
భోజన సదుపాయం ప్రారంభించిన ఎమ్మెల్యే
మక్తల్ : మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసు పత్రిలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన స్వంత డబ్బులతో భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజనం అందిస్తామన్నారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Updated Date - May 22 , 2025 | 11:01 PM