ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీతారాముల కల్యాణము చూతము రారండి..

ABN, Publish Date - Apr 05 , 2025 | 11:14 PM

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం పలు ప్రధాన ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను కమనీయంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముస్తాబైన పేట మూల హనుమాన్‌ మందిర్‌

- ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి

నారాయణపేట, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం పలు ప్రధాన ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను కమనీయంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కల్యాణ వేడుకలను వైభ వోపేతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీలు దృష్టి సారించాయి. జిల్లా కేంద్రంలోని మూల హనుమాన్‌ దేవాలయం వద్ద ఉదయం 11 గంటలకు వేద మంత్రాలతో, బాజా భజంత్రీల నడుమ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నామని హనుమాన్‌ భక్త బృందం తెలిపారు. శక్తి పీఠంలో స్వామి శాంతానంద్‌ పురోహిత్‌ నేతృత్వంలో సీతారాముల కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. వేడుకలకు టీవీ సిరియల్‌ ఆర్టిస్టులు హాజరు కానున్నారు. పళ్ల అనంతసేన స్వామి ఆలయంలో అర్చకుడు శ్రీపాద్‌ ఆధ్వ ర్యంలో సాయంత్రం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పళ్ల అంజనేయస్వామి అలయం నుంచి ఉదయం 9:30 గంటలకు ర్యాలీ ప్రారంభమై పురవీధుల గుండా రామాలయానికి చేరుకోనుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వీహెచ్‌ పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంబాబు కోరారు. కాగా, శ్రీరామనవమిని పురస్కరించుకొని కాషాయ ధ్వజాలపై శ్రీరాముడి చిత్రాలను తన చేతి కళా నైపుణ్యంతో ఆర్టిస్టు సీతు తీర్చిదిద్దారు.

Updated Date - Apr 05 , 2025 | 11:14 PM