ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కళాశాల విద్యార్థులపై కత్తితో దాడి

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:18 PM

కొందరు యువకులు పథకం ప్రకారం కత్తితో చేసిన దాడిలో ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్నది.

వీపుపై కత్తి గాయమైన రవితేజ

- ఒకరి పరిస్థితి విషయం, కర్నూల్‌ ఆసుపత్రికి తరలింపు

- దాడిచేసిన యువకుల పరారీ

- ప్రేమ వ్యవహారమే కారణం ?

గద్వాల క్రైం, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కొందరు యువకులు పథకం ప్రకారం కత్తితో చేసిన దాడిలో ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని గంజిపేట కాలనీకి చెందిన రవితేజ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం, అలాగే చరణ్‌తేజ ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం చరణ్‌తేజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న చింటూ అనే విద్యార్థి కళాశాల ఆవరణలో గొడవపడ్డారు. తర్వాత ఎక్కడివారు అక్కడే విడిపోయి వెళ్లిపోయారు. ఈ గొడవ విషయాన్ని చింటూ తన స్నేహితుడు ఉదయ్‌ తెలిపాడు. ఈ క్రమంలో చరణ్‌తేజ తన చెల్లెలిని కళాశాల నుంచి తీసుకొచ్చేందుకు సాయంత్రం బైక్‌పై గంజిపేట నుంచి కొత్తబస్టాండ్‌ వైపు వస్తుండగా సుంకులమ్మ మెట్టు కాలనీ సమీపంలో కోటబురుజు దగ్గర ఎరుకలిరాజు, బానుతో పాటు ఉదయ్‌ మరో ముగ్గురు వ్యక్తులు కాపుకాశారు. చరణ్‌తేజ బైక్‌ను ఆపి తాళం లాక్కొని కోటబురుజు సమీపంలోకి రావాలన్నారు. ఈమేరకు కోట బురుజు సమీపంలోకి చరణ్‌తేజ రావడంతోనే ముగ్గురు కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఎరుకలి రాజు అనే యువకుడు తన దగ్గర ఉన్న కత్తితో చరణ్‌తేజ్‌పై దాడి చేయగా వీపుపై గాయాలయ్యాయి. వారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అటువైపు వెళుతున్న చరణ్‌తేజ వరుసకు తమ్ముడు అయిన డిగ్రీ చదివే రవితేజ తన అన్నపై ఎందుకు దాడి చేస్తున్నారని అడిగేందుకు ప్రయత్నించగా వెంటనే ఎరుకలి రాజు తన చేతితో ఉన్న కత్తితో అతనిపై కూడా దాడిచేశాడు. దీంతో గాయాలైన రవితేజ వారినుంచి తప్పించుకుంటూ రోడ్డుపై పరుగెత్తుకువచ్చి తన మిత్రులకు ఫోన్‌లో విషయాన్ని చేరవేశాడు. వారు వచ్చి బైక్‌పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. అయితే రవితేజ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చరణ్‌తేజ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ఈ గొడవకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమే అని విశ్వసనీయంగా తెలుస్తుంది. తన మిత్రుడుకి దక్కని ప్రేమ వేరే వారికి దక్కుతుండటమే ఈ గొడవకు ప్రధాన కారణమని విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ విషయంపై బాధితులు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:18 PM