వసూలు రాజాలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:58 PM
విద్యుత్ శాఖలో కొంతమంది ఉద్యో గులు, సిబ్బంది వసూలు రాజాలుగా అవతారమెత్తారు.
ఏసీబీకి పట్టుబడుతున్నా మారని పలువురు ఉద్యోగుల తీరు
వనపర్తి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో కొంతమంది ఉద్యో గులు, సిబ్బంది వసూలు రాజాలుగా అవతారమెత్తారు. పైసలివ్వనిదే పని చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల తీరుపై విసిగిపోయిన పలువురు వినియోగదారులు ఏసీబీ అధికారులను సంప్రది స్తున్నారు. వారు ప్రత్యేక నిఘా ఉంచి పక్కా సమాచారంతో పట్టుకుంటు న్నారు. గత ఏడాది మే 31న రూ. 19వేలు లంచం తీసుకుంటూ ఎస్‌ఈ నాగేంద్ర కుమార్, డీఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్ ఏసీబీ అధికారు లు పట్టుబడడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఖిల్లాఘణపూర్ మండలంలో ఏఈగా వి ధులు నిర్వహిస్తున్న కొండయ్య మల్కాపూర్ గ్రామంలో రైస్‌మిల్ విద్యుత్ కనెక్షన్ కోసం రూ.50వేలు డిమాండ్ చేశారు. ఒప్పుకున్న ప్రకారం సదరు కాంట్రాక్టర్ గతంలో రూ.30వేలు ఇచ్చాడు. మళ్లీ 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించడంతో వారి సూచన మేరకు డీఈ కార్యాలయంలో రూ.10వేలు ఇస్తుండగా ఏఈ కొండయ్యను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు.
ఏ పని చేయాలన్నా ..
వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు వారి అవసరం నిమిత్తం మీటర్, ట్రాన్స్‌ఫార్మర్లు కావాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. జిల్లా కేం ద్రంలోని ఎస్‌ఈ, డీఈ కార్యాలయంలో కొంతమంది ఏళ్లతరబడి తిష్ట వే శారు. ఏ పని కావాలన్నా రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎల్సీ కోసం కూడా కిందిస్థాయి సిబ్బంది దావత్‌లు ఇప్పించుకు ని పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసిన కూడా చర్యలు తీసుకోకపోవడం వెనకాల విమర్శలు వినిపిస్తున్నాయి.
లక్షల్లో వేతనాలు.. అయినా కక్కుర్తి ..
విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు ఇతర శాఖలోని ఉద్యోగుల కన్నా వేత నాలు లక్షల్లో ఉంటాయి. అయినా ఆ ఉద్యోగులు డబ్బు పిచ్చితో పేదల నుంచి సంపన్నుల వరకు ప్రతీ చిన్న పనికి లంచం తీసుకుంటున్నారు. ప్రధానంగా నూతనంగా వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు మం జూరు అయితే చాలు వారికి కాసులపంటే, కాంట్రాక్టర్ల ద్వారా తమకు రావాల్సిన పర్సంటేజ్‌లను అధికారులు వసూలు చేసుకుంటున్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:58 PM