ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగుల పట్ల సీఎం వైఖరి ఆక్షేపణీయం

ABN, Publish Date - May 06 , 2025 | 11:35 PM

ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం పూర్తి భాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సమస్యలు పరిష్కరించమని కోరితే సీఎం రేవం త్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మీద నిం దారోపణలు చేయడం ఆక్క్షేపణీయమని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్‌ యూ టీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వృత్తిపర మైన శిక్షణ తరగతులు నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌లో టీఎస్‌యూటీఎఫ్‌ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య

- టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం పూర్తి భాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సమస్యలు పరిష్కరించమని కోరితే సీఎం రేవం త్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మీద నిం దారోపణలు చేయడం ఆక్క్షేపణీయమని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్‌ యూ టీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వృత్తిపర మైన శిక్షణ తరగతులు నిర్వహించారు. సదస్సు కు ముఖ్య వక్తలుగా టీఎస్‌టీయూఎస్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు జంగయ్యతో పాటు కోశాధికారి టి.లక్ష్మారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎవరూ అద నపు జీతాలు అడగడం లేదని, సంక్షేమ పథకా లు ఆపి జీతాలు పెంచమనడం లేదన్నారు. కేవ లం ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి పడిన డీఏలు ప్రకటించాలని, న్యాయబద్ధంగా దాచుకు న్న జీపీఎఫ్‌ సొమ్ములే అవసరానికి మాకు ఇ వ్వమని అడుగుతున్నారని, విశ్రాంత ఉద్యోగులు కూడా వారికి రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇ వ్వమని మాత్రమే కోరు తున్నారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొంది న ఉద్యోగులు 14 నెల లుగా వారి బెనిఫిట్స్‌ కో సం ఎదురు చూస్తున్నా రన్నారు. ప్రభుత్వం ఇ ప్పుడు మాట మార్చి ప్ర జల్లో ఉద్యోగులను పలు చన చేయడం విచారకర మన్నారు. సీఎం హోదా లో ఉండి చర్చలు, సం ప్రదింపులు జరిపి సమ స్యలు పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగులపై ఆరోపణలతో బజారున పడేయడం సమంజసం కాదన్నారు. టీఎస్‌టీయూఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత అక్టోబరు 24న ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ ప్రతినిధులతో సీ ఎం రేవంత్‌రెడ్డి రెండు గంటల పాటు సమావే శమై ఆర్ధికేతర సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ని నియమిస్తానని, ఆర్థికపరమైన అంశాలపై వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఒక్కొక్కటిగా ప రిష్కరించుకుందామని చెప్పారన్నారు. కానీ ఆరు నెలలు గడుస్తున్నా ఒక్కసారి కూడా ఉద్యోగుల తో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కాలేద న్నారు. జేఏసీ ఇచ్చిన 57 డిమాండ్లలో 45 ఆర్థికే తర స్వల్ప భారంతో ఉన్నవన్నారు. ఉద్యోగులతో సత్సంబాలు కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే కేబినెట్‌ సబ్‌ కమిటీ, సీఎం జే ఏసీతో సమావేశమై సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఎస్‌టీయూఎఫ్‌ రా ష్ట్ర కార్యదర్శి ఎస్‌.రవిప్రసాద్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షు డు ఆర్‌.కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌శర్మ, నాయకులు చిన్నయ్య, శంకర్‌, లలితాబాయి, తి రుపతయ్య, బాల్‌రాజు, చంద్రశేఖర్‌, కురుమ య్య, రబ్బానీపాషా, బాబురావు, నారాయణ, మమమూద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:35 PM