ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సారూ.. పట్టించుకోవాలి మీరు

ABN, Publish Date - Aug 04 , 2025 | 10:57 PM

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ఉన్నత పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు.

ముఖ్యమంత్రికి పంపుతున్న లేఖలను చూపుతున్న గట్టు ఉన్నత పాఠశాల విద్యార్థులు

- పాఠశాల సమస్యలపై లేఖలు రాసిన విద్యార్థులు

- గట్టు ఉన్నత పాఠశాలలో సమస్యల తిష్ఠ

- సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : పీడీఎస్‌యూ

గట్టు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ఉన్నత పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు. గట్టు ఉన్నత పాఠశాలలోని సమస్యలపై ఆంధ్రజ్యోతిలో చదువులు గట్టెక్కేనా? శీర్షికన వార్త ప్రచురితమైంది. దీంతో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకు లు స్పందించారు. విద్యారుల్థలో కలిసి పాఠశాల ఎదుట ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు గానీ, పాలకు లు గానీ పట్టించుకోవడంలేదని జిల్లా అధ్యక్షు డు హలీంపాష పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 402 మంది విద్యార్థులు లేఖలు రాశారు. పాఠశాల ఎదుట నిలబడి ఆందోళన చేశారు. తాగునీటి సమస్య, మూత్రశాలలు, త రగతి గదులు, బోధనా సిబ్బంది కొరత ఉందని తెలిపారు. గదుల కొరతతో రెండు తరగతులను కలిపి ఒకే గదిలో కొనసాగిస్తున్నారని అన్నారు. వెంట నే ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటేశ్‌, రఫీ, షకీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 10:57 PM