బాధిత కుటుంబాలకు సీఎం భరోసా
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:41 PM
వాహనం ఢీకొట్టడంతో మృతిచెందిన నర్సింగ్ వి ద్యార్థినుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆ దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మె ల్యే కృష్ణమోహన్‌రెడ్డి విన్నవించారు.
- ప్రమాదం వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాలన్యూటౌన్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): వాహనం ఢీకొట్టడంతో మృతిచెందిన నర్సింగ్ వి ద్యార్థినుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆ దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మె ల్యే కృష్ణమోహన్‌రెడ్డి విన్నవించారు. దీనికి ము ఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచిం చారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మృతుల కు టుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశార న్నారు. అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఫోన్‌లో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అం తకుముందు ప్రమాదం విషయం తెలియడంతో ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:41 PM