ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిర్చి రైతుకు తీరని కష్టం

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:40 PM

అకాలవర్షం కారణంగా మిర్చి రైతుకు తీరని నష్టం జరిగిందని అలంపూరు ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

తడిసిన మిర్చిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు, నాయకులు

మానవపాడు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): అకాలవర్షం కారణంగా మిర్చి రైతుకు తీరని నష్టం జరిగిందని అలంపూరు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలో తడిసిన మిర్చి పం టను సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై ఇదివరకే అసెంబ్లీలో మాట్లాడానని, మిర్చి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెవెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వానకాలంలో పొగాకు సాగు చేయాలని వివిధ కంపెనీలు విత్తనాలు సరఫరా చేసి పంటను కొనుగోలు చేయడంలేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్రాముడు, చోట, పరమేష్‌ ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:40 PM