ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారులను బాగా చదివించాలి

ABN, Publish Date - Jun 05 , 2025 | 11:30 PM

చిన్నారులను బాగా చదివించాలని, వారిని రెగ్యులర్‌గా పాఠశాలలకు పంపించాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యా నాయక్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌ సిబ్బందిని ఆదేశించారు.

ప్రతిభ కనబర్చిన చిన్నారులకు మెడల్‌ వేసి అభినందిస్తున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యానాయక్‌

- సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యానాయక్‌

- చిల్డ్రన్స్‌ హోం తనిఖీ

నారాయణపేట టౌన్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): చిన్నారులను బాగా చదివించాలని, వారిని రెగ్యులర్‌గా పాఠశాలలకు పంపించాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యా నాయక్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌ సిబ్బందిని ఆదేశించారు. పేట జిల్లా కేంద్రంలోని బోరంబావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్‌ హోమ్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యానాయక్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. రోజువారీ ఆహార దినపట్టికను అడిగి, వసతుల గురించి తెలుసుకున్నారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగునీటి పరిశుభ్రత, సీసీ పుటేజీలను పరిశీలించారు. తల్లిదండ్రులతో పర్మిషన్‌, సంతకాలు తీసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన సరుకులు, బియ్యం నాణ్యతను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా లేదా పరిశీలిం చారు. అనంతరం బాల సదనంలో పునరావాసం పొందుతున్న బాలికతో న్యాయాధికారి మా ట్లాడారు. ఊట్కూర్‌లో బాల్య వివాహం చేస్తు న్నారనే సమాచారంతో బాలికను బాలల సంక్షేమ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బాలసదనంలో ఉంచారు. ఆ తర్వాత పరీక్షల్లో మొదటి, రెండో ర్యాంకు వచ్చిన చిన్నారులను అభినందించి, మె డల్స్‌ వేశారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మిపతిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:30 PM