ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనపై హర్షం

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:06 PM

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీలకు రాజకీయాల్లో, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్‌ కలిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీంలు అన్నారు.

ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌కు మిఠాయి తినిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం

- టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

- సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

నారాయణపేట/మరికల్‌/ దామరగిద్ద, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీలకు రాజకీయాల్లో, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్‌ కలిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీంలు అన్నారు. బుధవారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి వారు ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింప జేశారన్నారు. బీసీ రిజర్వేషన్‌పై బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసి బీసీలపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ శరణప్ప, లిఖి రఘు, విండో డైరెక్టర్‌ మల్లేష్‌, ఆర్టీఏ బోర్డు మెంబర్‌ పోషల్‌ రాజేష్‌, మహ్మద్‌ ఖురేషీ, యూసుఫ్‌, తాజ్‌, వెంకుగౌడ్‌, కుర్వ మనోజ్‌, వెంకటప్ప, కార్తీక్‌, గడ్డం వినోద్‌, అనిల్‌, వెంకటయ్య తదితరులున్నారు.

అదేవిధంగా, మరికల్‌లో సూర్యచంద్ర ఫౌండేషన్‌ అధినేత సూర్యమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు గ్రామ పురవీధుల గుండా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాల వే సి నివాళి అర్పించారు. సోనియా, రాహుల్‌గాంఽధీ, మల్లికార్జున్‌ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, పేట ఎ మ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తు సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు వీరన్న, హరీశ్‌కుమార్‌, గోవర్ధన్‌, రాజు, అం జి, మల్లేష్‌, ఆంజనేయులు తదితరులున్నారు.

దామరగిద్దలోనూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప, జడ్పీటీసీ మాజీ సభ్యులు రవీందర్‌నాథ్‌, కె.వెంకట్రాంరెడ్డి, రఘు, రాములు, చిన్నయ్య, ఆనంద్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:06 PM