ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉడిపి హోటల్‌లో తనిఖీలు

ABN, Publish Date - May 06 , 2025 | 11:25 PM

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉడిపి హోటల్లో ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు.

ఉడిపి హోటల్‌ ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారి నీలిమ

శాంపిల్స్‌ సేకరించిన అధికారులు

వనపర్తి టౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉడిపి హోటల్లో ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. హోటల్‌లో ఓ వినియోగదారుడికి సప్లై చేసిన ఇడ్లీలో జెర్రి వచ్చింది. ఈ విషయంపై వివిధ పత్రికల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి. అందుకు స్పందించిన ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి నీలిమ మంగళవారం తన బృందంతో పట్టణంలోని కొ త్తబస్టాండ్‌ సమీపంలో గల ఉడిపి హోటల్‌ల్లో తనిఖీ చేశారు. హోటల్‌లోని వంట గది, పాత్రలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎన్ని సంవత్సరాల నుంచి హోటల్‌ నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. శాంపిల్స్‌ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హోటల్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ వాజీద్‌ పాల్గొన్నారు. అలాగే ఆహారభద్రత జిల్లా ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ రామచంద్రారావు ఉడిపి హోటల్‌ను సాయంత్రం తనిఖీ చేశారు. పరిశుభ్రత లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత పాటిం చకుంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - May 06 , 2025 | 11:25 PM