ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల పేరు మార్పు

ABN, Publish Date - Jul 17 , 2025 | 11:21 PM

శ్రీశైలం పరిసర ప్రాంతంలో ఉన్న కొండలకు పూర్వం బ్రహ్మగిరి, కృష్ణగిరిగా శ్రీశైలం చరిత్రలో ఉన్నపటికీ 1963లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దోమల పెంట, ఈగలపెంట గ్రామాలుగా పిలువబడ్డాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- బ్రహ్మగిరిగా దోమలపెంట, కృష్ణగిరిగా ఈగల పెంట

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

బ్రహ్మగిరి (దోమలపెంట), జూలై 17 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం పరిసర ప్రాంతంలో ఉన్న కొండలకు పూర్వం బ్రహ్మగిరి, కృష్ణగిరిగా శ్రీశైలం చరిత్రలో ఉన్నపటికీ 1963లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దోమల పెంట, ఈగలపెంట గ్రామాలుగా పిలువబడ్డాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. గురువారం దోమలపెంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం దోమలపెంటను బ్రహ్మగిరి, ఈగలపెంటను కృష్ణగిరిగా ప్రభుత్వం అధికారికంగా మార్పు చేసిందన్నారు. దోమలపెంట, ఈగలపెంట గ్రామాలతో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో బోర్డులపై పేర్లు మార్పు చేయాలని ఇప్పటికే కలెక్టర్‌ నుంచి ఆ దేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాను కూడా అన్ని శాఖల అధికారులకు ఆదేశించానన్నారు. బ్రహ్మగిరిలో మహిళా సంఘాల సభ్యులతో స మావేశం అయ్యారు. బ్రహ్మగిరి, కృష్ణగిరి, పా తాళగంగ గ్రామాల్లో ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వపరంగా పెట్రోల్‌ బంక్‌, సూపర్‌ మార్కెట్‌, జూట్‌ బ్యాగుల త యారీ, స్వగృహ వంటల తయారీ వంటి అవకాశాలు కల్పించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. అంతేకాకుండా బ్రహ్మగిరి, కృష్ణగిరి గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో నిర్మించిన క్వార్టర్స్‌ను నిరుపేదలకు క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసే వారి నుంచి స్థలాలను తిరిగి ఇరిగేషన్‌ శాఖకు అప్పగిస్తామన్నారు. శ్రీశైలం నుంచి బ్రహ్మగిరి వరకు గతంలో నడిచిన ఆత్మకూర్‌ డిపో బస్సును తిరిగి పునరుద్ధరించేటట్లు శ్రీశై లం ఎమ్మెల్యేతో మాట్లాడామని, అందుకు వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెలే పేర్కొన్నారు కార్యక్రమంలో అమ్రాబాద్‌ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ అనురాధ, ఎంపీ డీవో లింగయ్య, ఐకేపీ ఏపీఎం నిరంజన్‌, మాజీ సర్పంచ్‌ చత్రునాయక్‌, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్‌, పూరి శ్రీనువాసులు, నాయకులు హరినారాయణగౌడ్‌, మొయిజొద్దీన్‌ సిరాజ్‌, రసూల్‌, గురవయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:22 PM