సంబురంగా ‘ట్రెడిషనల్ డే’
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:39 PM
సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నాగర్‌కర్నూల్ కలెక్ట ర్ బదావత్ సంతోష్ అన్నారు.
- సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది
- నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నాగర్‌కర్నూల్ కలెక్ట ర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగ ర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులు నిర్వహించిన ‘ట్రెడిషనల్‌డే’ (సాంప్ర దాయ దినోత్సవం) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో పాట లు, నృత్యాలు, నాటికలు, ఇతర సాంస్కృతిక ప్రద ర్శనలను నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతో ష్ వారితో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ తాను కళాశాలలో చదువు కుంటున్న సమయంలో ఇలాంటి వేడుకలో పాల్గొ న్నానని గుర్తు చేశారు. వైద్య విద్యార్థులు ఎంబీబీ ఎస్ పూర్తి చేసిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజ లకు సేవ చేయాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో వైద్య సేవలు సులువుగా అందుబాటు లో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని, గ్రామీణ ప్రాం తాల్లో వైద్యులు సేవలందించడం బాఽధ్యతగా తీ సుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, నాగర్‌కర్నూల్ డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మీ, వైద్య కళాశాల అధ్యా పకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:39 PM