ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్పులు విరమించి శాంతి చర్చలు జరపాలి

ABN, Publish Date - May 04 , 2025 | 11:20 PM

దండ కారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో చేపట్టిన కాల్పులను వెంటనే విరమించి మావోయిస్టుల తో శాంతి చర్చలు జరపాలని వక్తలు కోరారు.

పౌర హక్కుల సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

గద్వాల టౌన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): దండ కారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో చేపట్టిన కాల్పులను వెంటనే విరమించి మావోయిస్టుల తో శాంతి చర్చలు జరపాలని వక్తలు కోరారు. ఆదివాసీలపై జరుగుతున్న మారణహోమాన్ని నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం మానవీయ దృక్ప థాన్ని ప్రదర్శించాలన్నారు. ఆపరేషన్‌ కగార్‌పై పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వాల్మీకి భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్య క్షత వహించిన పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీసుభాన్‌ మాట్లాడుతూ శాంతిచర్చలకు తాము సిద్ధమంటూ మావోయి స్టులు బాహాటంగా ప్రకటించినా కేంద్ర ప్రభు త్వం ఎన్‌కౌంటర్లను యథేచ్చగా కొనసాగిస్తుం డటం దుర్మార్గమన్నారు. సమావేశంలో న్యాయ వాది మధుసూదన్‌ బాబు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, వెం కటస్వామి మాట్లాడుతూ దండకారణ్యంలో ఆది వాసులపై కాలుప్పు జరపడం దుర్మార్గమన్నా రు. నక్సలైట్ల ఏరివేత పేరుతో కేంద్రమే హ త్య లు జరపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చర్చ ల కోసం మావోయిసులు మందుకు వస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ఆదివాసీలను భయ బ్రాంతులను చేసి సహజ అటవీ సంపదను కా ర్పొరేటర్లకు కట్టబెట్టే కుట్రతోనే కేంద్రం కాల్పుల ను కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్యలు జరపాలన్నారు. సమావేశంలో పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు శంకర ప్రభాకర్‌, క రువ పల్లయ్య, వాల్మీకి, జి.గోపాల్‌, గోపాల్‌రావు, కార్తీక్‌, బీరెల్లి దానయ్య, గంజిపేట రాజు, ఆంజ నేయులు, రామరాజు, జయమ్మ ఉన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:20 PM