ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేరుకే బీటీ.. మొత్తం గోతులే

ABN, Publish Date - May 29 , 2025 | 11:07 PM

మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు.

రాణిపేట, వస్పుల గ్రామాల మధ్యన గుంతలమయమైన బీటీ రోడ్డు

ప్రయాణానికి నిత్యం నరకయాతనే

పట్టించుకోని అధికారులు

మిడ్జిల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మండలంలోని రాణిపేట నుంచి వస్పుల, దోనూర్‌, సింగందొడ్డికి వెళ్లే బీటీరోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాణిపేట నుంచి అయ్యవారిపల్లి గ్రామానికి వెళ్లే బీటీరోడ్డుపై రైతులు వ్యవసాయ పొలాలకు సాగునీటిని తీసుకెళ్లేందుకు రోడ్డుపై కాల్వతీసి పైప్‌లైన్‌ నిర్మాణాలు చేపట్టడంతో బీటీరోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వర్షాకాలంలో గోతులలో నీరు నిలిచి పలు మార్లు ద్విచక్ర వాహనదారులు కిందపడి ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు రాణిపేట నుంచి సింగందొడ్డి వరకు బీటీరోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో చిన్నచిన్న గోతులు సైతం వర్షాలకు పెద్దవిగా మారాయి. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రోడ్లపై ఏర్పడిన గోతులను సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 29 , 2025 | 11:07 PM