ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

ABN, Publish Date - May 01 , 2025 | 11:50 PM

గడి చిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉమ్మడి పాలమూ రు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్‌ 1లో పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

- మార్చిలోగా పాలమూరు - రంగారెడ్డి పెండింగ్‌ పనులు పూర్తి చేస్తాం

- విద్యుత్‌ పవర్‌ పాయింట్‌ పూర్తి కాలేదు..

- ప్రాజెక్టును ఎలా ప్రారంభించారని అధికారులపై ఆగ్రహం

- మార్చి 31 , 2026 వరకు 100 శాతం పూర్తి చేస్తాం

- మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి

- పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించిన

మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌/ కోడేరు/రేవల్లి, మే 1(ఆంధ్రజ్యోతి) : గడి చిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉమ్మడి పాలమూ రు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో పర్యటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన భాగమైన విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డు, ప్రాజెక్టు సబ్‌ స్టేషన్‌, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పంపు హౌస్‌, నార్లాపూర్‌ రిజర్వాయర్‌, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 3లో హెడ్‌ రెగ్యులేటర్‌, ఏదుల రిజర్వాయర్‌ పంప్‌హౌస్‌, నార్లపూర్‌ లో హెడ్‌వర్క్స్‌, తీగలపల్లి, వట్టెంలల్లో పంపుహౌజ్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి లో పరిశీలిస్తున్నామని తెలిపారు. మార్చి లోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని హా మీ ఇచ్చారు. మరో ఆరు నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రా జెక్టులో భాగమైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ ఏదుల వట్టెం, కర్వెన ఈ నాలుగు రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీరు నింపడానికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా ఉదండాపూర్‌ రిజ ర్వాయర్‌ నింపడానికి కావాల్సిన ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను 2026 మార్చి 31 లోపు 100 శాతం పూర్తి చేయడానికి సమీక్షిస్తున్నట్లు ఆయన స్ప ష్టం చేశారు. అదే విధంగా ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టులో ని రుపయోగంగా ఉన్న రెండు మోటార్లను మూడు నెల ల్లో మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామన్నా రు. గత ప్రభుత్వం కేవలం హంగు ఆర్భాటాలకు ప్రాఽ దాన్యమిచ్చిందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన భాగమైన విద్యుత్‌ పవర్‌ పాయింట్‌ పూర్తి కా నిదే ప్రారంభోత్సవాలు ఎలా చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి విద్యుత్‌ శాఖకు రూ.262 కోట్లు మం జూరు చేశామని, అన్ని పంపింగ్‌ స్టేషన్లకు అన్ని విధా లుగా పనులు పూర్తి చేయడానికి నిధులు వెచ్చిస్తున్న ట్లు మంత్రి వెల్లడించారు. తప్పనిసరిగా ఉమ్మడి పాల మూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని నల్గొండ జిల్లాకు అవస రమైన 0.5టీఎంసీల నీటిని అదనంగా కృష్ణానది వరద జలాల నుంచి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌ బీసీ దుర్ఘటన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ర కాలుగా స్పందించి అంతుచిక్కని కార్మికుల ఆచూకీ గు రించి పూర్తిస్థాయిలో అన్ని విభాగాలకు చెందిన దాదా పు 700మందినిరంగంలోకి దించినప్పటికీ ఆరుగురు కా ర్మికుల ఆచూకీ ఇప్పటి వరకు చిక్కకపోవడం పట్ల ప్ర భుత్వం విచారం వ్యక్తం చేస్తుందని వారందరీ కుటుం బాలకు ఒక్కొక్కరికి 25లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. జువాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు 8 విభా గాలకు చెందిన వారందరితో మున్ముందు చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిపుణుల కమిటీని వేశామని వారు నివేదిక అందించిన తర్వాత సహాయక చర్యలను ముందుకు కొనసాగిస్తామని చెప్పారు. అదే విధంగా వనపర్తి జిల్లాలోని ఏదుల పేజ్‌ టు రిజర్వా యర్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వన పర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎస్సీ రావు ల గిరిధర్‌ మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్ర మంలో కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్సీ దామో దర్‌రెడ్డి, ఎస్పీ రఘునాథ్‌ గైక్వాడ్‌, ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, డీఎ స్పీ శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:50 PM