వికసించిన ‘బ్రాకిస్టెల్మా’
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:47 PM
మహ బూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలోని బొటానిక ల్ గార్డెన్‌లో సోమవారం అరుదైన పుష్పం బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ వికసించిందని
- జడ్చర్ల డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్‌లో అరుదైన పుష్పం
జడ్చర్ల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : మహ బూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలోని బొటానిక ల్ గార్డెన్‌లో సోమవారం అరుదైన పుష్పం బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ వికసించిందని కళా శాల ప్రిన్సిపాల్ సుకన్య, గార్డెన్ సమన్వయక ర్త, వృక్షశాస్త్ర సహాయాచార్యుడు డాక్టర్ సదాశి వయ్య తెలిపారు. ఈ మొక్కను 2020 సంవ త్సరంలో ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కళాశాల వృ క్షశాస్త్ర సహయాచార్యుడు డాక్టర్ ప్రసాద్‌తో కలిసి కనుక్కొని, బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ అని నామకరణం చేసినట్లు ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. ఈ మొక్క విశిష్టతలను డాక్టర్ సదాశివయ్య వివరించారు. ఇవి నల్లమల ప్రాంతంలోనే పెరుగుతాయని, ప్రపంచంలో మరె క్కడా ఉండవని తెలిపారు. భూమిలో దుంప ఉండే ఈ మొక్కకు తొలకరి వర్షాలు పడగానే పొడవాటి కాండం వచ్చి పుష్పిస్తుందని, ఆ తర్వాత ఆకులు రావడం దీని ప్రత్యేకత అని వివరించారు. సన్నని కాండం 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందని, ప్రతి కణుపు వద్ద తెల్లని కేశాలున్న రెండు ముదురు ఎరుపు లేదా నల్లని పూలు పూస్తాయని తెలిపారు. ఈ పూలు 8 మిల్లీమీటర్ల నుంచి ఒక సెంటీమీటరు వరకు పెరుగుతాయని చెప్పారు. జలుబు, తలనొప్పి, రొమ్ము నొప్పులకు ఈ మొక్క దుం పలను మందుగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీని ఔషధ గుణాలపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. బొటానికల్ గార్డెన్‌లో ఈ మొక్క పుష్పించడం ఇదే మొదటి సారని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Updated Date - Apr 21 , 2025 | 11:47 PM