మతం పేరుతో బీజేపీ రాజకీయం
ABN, Publish Date - Jul 19 , 2025 | 10:50 PM
భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే దేశంలో బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవి కుమార్ విమర్శించారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవి కుమార్
వనపర్తి టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే దేశంలో బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవి కుమార్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రం లోని ఫంక్షన్‌హాల్‌లో బాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా నాయకత్వపు అవగాహన శిక్షణ తరగతులు ని ర్వహించారు. సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికా రంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. కా ర్పొరేట్ సంస్థలకు దేశ సంపదను కట్టబెడు తుందని, ఒక శాతం ఉన్న ధనవంతుల చేతిలో 40 శాతం దేశ సంపద ఉందన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నే డు దేశభక్తి గురించి మాట్లాడటం సిగ్గుచేట న్నారు. మతం వ్యక్తిగత విషయమని, కానీ బీజేపీ, సంఘ్ పరివార్ మతాన్ని రాజకీయాల కు జోడించి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాం కు చేసుకుంటుందని మండిపడ్డారు. రాజ్యాంగా న్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చేం దుకు శతవిధాలుగా బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. సమావేశంలో పుట్ట ఆంజనే యులు, ఎండీ జబ్బార్, మండ్ల రాజు, ఆర్‌ఎన్ రమేష్, లక్ష్మి, మేకల ఆంజనేయులు, పరమేశ్వ రాచారి, బొబ్బిలి నిక్సన్, ఉమా, గుంటి వెంకట య్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 10:50 PM