ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు

ABN, Publish Date - Jun 10 , 2025 | 11:40 PM

బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

రచ్చకట్ట పై మాట్లాడుతున్న మంత్రి

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలంలోని గూడెం, బెక్కెం, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడెం గ్రామంలోని జములమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. రచ్చకట్ట వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ విశిష్టతను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని 123 గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు కోసం రూ. 1.23 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్రీడారంగ అభివృద్ధి కోసం మరో రూ.1.23 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామానికి బస్సు సమస్య ఉందని చెప్పడంతో డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జములమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. మహిళా భక్తులతో మాట్లాడి గుగ్గిళ్ల ప్రసాదం స్వీకరించారు. అక్కడి నుంచి బెక్కెం గ్రామానికి చేరుకొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత అమ్మాయిపల్లికి చేరుకున్న ఆయన గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:40 PM