ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూసమస్యలశాశ్వత పరిష్కారానికి భూ భారతి

ABN, Publish Date - Apr 16 , 2025 | 11:34 PM

ప్రజల నుంచి అభిప్రాయా లను క్రోడీకరించి భూసమస్యల శాశ్వత పరిష్కరానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కోదండరెడ్డి

- రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

వంగూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి అభిప్రాయా లను క్రోడీకరించి భూసమస్యల శాశ్వత పరిష్కరానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని పోల్కంపల్లి రైతువేదికలో నూతన రెవెన్యూ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కోండరెడ్డితో పాటు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అమరేందర్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో రెవెన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రెవెన్యూ వ్యవస్థను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చారని, భూమి హక్కులు రైతులకే ఉండాలని స్పష్టం చేశారన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి రైతు కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ధరణి సమస్యలు భూ భారతితో తొలగిపోతాయని అన్నారు. గతంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. 2017 డిసెంబరులో భూ రికార్డుల ప్రక్షాళన చేసిన ధరణి రైతులకు శాపంగా మారి రెవెన్యూ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని ఆరోపించారు. నూతన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారు లకు సూచించారు. అనంతరం సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు. ఆ తర్వాత వంగూరులోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరి శీలించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దార్‌ మురళీ దర్‌, డీటీ వెంకటరమణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, సీఈవో విష్ణుమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:34 PM