ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
ABN, First Publish Date - 2025-05-28T23:03:55+05:30
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తల్లి శశికళ అన్నారు.
జడ్చర్ల, బాలానగర్ మే 28 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తల్లి శశికళ అన్నారు. బుధవారం పట్టణంలోని 14వ వార్డు సంజీవయ్య కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోసి, ప్రొసిడింగ్‌లు అందజేశారు. అంతకుముందు బాలానగర్ మండలం తిరుమలగిరిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. పెద్దరేవల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆదిరమణరెడ్డి, యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగులు అందజేశారు. మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, హౌసింగ్ ఏఈ ఖాజా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వప్న, నాయకులు శివప్రసాద్, మల్లికార్జున్, లక్ష్మమ్మ, పద్మ, సత్యనారాయణ, తైసిన్, ఎర్ర ఆనంద్, అనుప, కృష్ణయ్య, ఖాజాఅలిముద్దీన్, నసీర్, బాబా, ఫకృద్దీన్, విజయభాస్కర్‌రెడ్డి, అరవిందమ్మ, శాంతయ్య, నాగరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అనిత, అరుణ, శివకుమార్ ఉన్నారు.
మిడ్జిల్ : మండలంలోని వెలుగొమ్ముల, రాణిపేట గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అధికారులు భూమిపూజ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల అందజేస్తామని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతిఅల్వాల్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో గీతాంజాలి, మార్కెట్ డైరెక్టర్ సత్యంగౌడ్, నాయకులు గౌస్, సాయిలు, మల్లికార్జున్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మల్లేష్, శ్రీను, విజయాజీ, శ్రీధర్‌రావు, రవిందర్‌రెడ్డి ఉన్నారు.
నవాబ్‌పేట : మండలంలో బుధవారం మార్కెట్ చైర్మన్ హరలింగం, మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ తులసీరాం ఆధ్వర్యంలో మండలంలోని గురుకుంట, దర్పల్లి, అమ్మాపూర్, కిషన్‌గూడ, కాకర్జాల, పుట్టోనిపల్లి, కామారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేశారు. హౌజింగ్ ఏఈ శ్రావని, మార్కెట్ డైరెక్టర్ ప్రభాకర్ నీలకంఠం, రాజశేఖర్ పాల్గొన్నారు.
గండీడ్ : మండలంలోని పెద్దవార్వల్, చిన్నవార్వల్, లింగాయిపల్లి గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో దేవన్న, హౌసింగ్ ఏఈ పుష్పలత భూమిపూజ చేశారు. పీసీసీ సభ్యుడు నరసింహరావు, ఆంజనేయులు, వెంకటేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Updated Date - 2025-05-28T23:03:56+05:30 IST