ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌మాల బిల్లుల వివరాలు అందించడం లేదు

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:19 PM

ఎన్నిసార్లు అడిగినా స మాచారం ఇవ్వకుండా, తమపై గొడవకు దిగుతున్నాడని నందిన్నె చెందిన దివ్యాంగుడు సత్యారెడ్డి, ఆయన భార్య అంబమ్మ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు సోమవారం సంబంధిత అధికారిపై ఫిర్యాదు చేశారు.

- అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

గద్వాల క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): భారత్‌మాలకు సంబంధించి ఎన్నిసార్లు అడిగినా స మాచారం ఇవ్వకుండా, తమపై గొడవకు దిగుతున్నాడని నందిన్నె చెందిన దివ్యాంగుడు సత్యారెడ్డి, ఆయన భార్య అంబమ్మ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు సోమవారం సంబంధిత అధికారిపై ఫిర్యాదు చేశారు. తన పొలం కుచ్చినెర్ల గ్రామ శివారులోని సర్వేనెంబర్‌ 18లో పోగా అప్పట్లో రూ.15లక్షలు పరిహారం అందిందని తెలిపారు. గుడిసె, చిన్నవాటర్‌ ట్యాంక్‌, పెద్దవాటర్‌ ట్యాం క్‌, బోర్లు కూడా పోయాయని, వీటన్నింటికీ పరిహారం దాదాపు రూ.5లక్షల దాకా రావాల్సి ఉం దని, 2013 నుంచి దరఖాస్తు చేస్తున్నప్పటికీ ఇవ్వడంలేదని తెలిపారు. ఈవిషయమై కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇవ్వగా సంబంధిత అధికారి తగ్గరకు రెఫర్‌ చేశారని తెలిపారు. ఇప్పటికీ కూడా ఆయన ప్రవర్తన మార్చుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈవిషయంపై సంబంధిత అధికారి చింతామణి పటేల్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా వారి ఫైల్‌ సంబంధిత కార్యాలయానికి పంపామని, త్వరలోనే వారికి పరిహా రం డబ్బులు అందుతాయన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:19 PM