ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ తొలి సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ

ABN, Publish Date - May 22 , 2025 | 11:03 PM

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌/ నారాయణపేట న్యూటౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్ట రేట్‌ ప్రజావాణి హాల్‌లో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దళిత సమాజోద్ధరణ, అంటరానితనం, మహిళల బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారని, జోగినీ వ్యవస్థను తొలగించడానికి పాటు పడ్డారని అన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఆర్డీవో రాంచందర్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అబ్దుల్‌ఖలీల్‌, డీపీఆర్‌వో రషీద్‌, ఏవో జయసుధ, వెంకటేష్‌, సిబ్బంది ఉన్నారు.

ఎస్పీ కార్యాలయంలో...

పేట పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అన్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వేల మంది విద్యార్థులకు విద్య అందించారని పేర్కొ న్నారు. ఏఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, ఆర్‌ఎస్‌ఐలు, డీపీవో, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:03 PM