మెరుగైన సేవలే లక్ష్యం
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:14 PM
ప్రజలకు మైరుగైన వె ౖద్య సేవలు అందించడమే లక్ష్యంగా నారా యణపేట జిల్లా ఆస్పత్రిని గత పాలకులు అప్పక్‌పల్లిలో నిర్మించిన భవన సముదాయంలోకి తప్పని పరిస్థితుల్లో తరలించామని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
నారాయణపేట, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మైరుగైన వె ౖద్య సేవలు అందించడమే లక్ష్యంగా నారా యణపేట జిల్లా ఆస్పత్రిని గత పాలకులు అప్పక్‌పల్లిలో నిర్మించిన భవన సముదాయంలోకి తప్పని పరిస్థితుల్లో తరలించామని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట సీవీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నారాయణపేటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో గత పాలకులు అప్పక్‌పల్లి దగ్గర ఆస్పత్రి భవనం నిర్మిచారన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పాత ఆస్పత్రి భవన సముదాయం శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితికి చేరుకుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిని అప్పక్‌పల్లికి తరలించామన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రజలు సహకరించాలన్నారు. కొత్తగా సీటీ స్కానింగ్ వచ్చిందని, అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు రెండో సంవత్సరం నుంచి ఆస్పత్రిలో ఫిజికల్ క్లాసులు ఉంటాయన్నారు. నర్సింగ్ కాలేజీతో పాటు మాతా శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక వైద్యురాలిగా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చుస్తానన్నారు. ప్రాథమిక వైద్యసేవల కోసం అర్బన్ హెల్త్ సెంటర్‌తోపాటు పీపీ యూనిట్‌లో వైద్యం అదేలా చూస్తామని తెలిపారు. అప్పక్‌పల్లి జిల్లా ఆస్పత్రి దగ్గర ప్రతీ బస్సు ఆపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామని, బస్సులు ఆపుతారని చెప్పారు. ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆటో చార్జీల నియంత్రణ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడామని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మాజీ చైర్మన్‌లు బండి వేణుగోపాల్, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 11:14 PM