ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాబోయ్‌ దుమ్ము

ABN, Publish Date - May 09 , 2025 | 11:23 PM

డబుల్‌ లైన్‌ నుంచి ఫోర్‌ లైన్‌ రోడ్డుగా మారుతుందంటే సంబురపడ్డారు. కానీ అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. నిత్యం దుమ్ముతో ప్రయాణి కులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.

భూత్పూర్‌ వద్ద బస్సు వెళుతుండగా కమ్మేసిన దుమ్ము

- నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు

- వాహనదారులు, ప్రజలకు తప్పని తిప్పలు

- భూత్పూర్‌ నుంచి పాలమూరు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు

భూత్పూర్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ లైన్‌ నుంచి ఫోర్‌ లైన్‌ రోడ్డుగా మారుతుందంటే సంబురపడ్డారు. కానీ అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. నిత్యం దుమ్ముతో ప్రయాణి కులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. భూత్పూర్‌ నుంచి చించోల్లి వరకు నా లుగు లైన్ల రోడ్డును జాతీయ రహదారిగా మా ర్చారు. భూత్పూర్‌ నుంచి దాదాపుగా 102కిలో మీటర్ల వరకు ఈ రోడ్డు పనులు చేపట్టారు. పనుల్లో ఆలస్యం అవుతుండడంతో వాహనదారు లు, ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటు న్నారు. అమిస్తాపూర్‌ వద్ద మిషన్‌ భగీరథ నీటి పైపులైన్‌ను మార్చడానికి సుమారుగా మూడు నెలలు కావొస్తుంది. ఇంతవరకు పని పూర్తికా లేదు. విస్తరణ పనులు చేపట్టేటప్పుడు కంకర, మట్టి పోసిన ప్రాంతాల్లో నిరంతరం వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా దుమ్ము లేవకుండా నీరు పో యాల్సి ఉంటుంది. కాగా అలాంటిదేమి కనిపిం చడం లేదు. కాంట్రాక్టర్‌, సంబంధిత శాఖ అధి కారులు పట్టించుకోక పోవడంతో పనులు చేపట్టే చోట దుమ్ము భరించలేనంతగా ఎగురుతుంది. ముఖ్యంగా భూత్పూర్‌ వద్ద మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట వాహనాలు వెళ్తున్న సమ యంలో మరింత ఇబ్బందిగా మారింది. ఈ విష యంలో డీఈఈ సుమంత్‌కుమార్‌ను వివరణ కోరగా.. రోడ్డు పనుల్లో భాగంగా దుమ్ము రాకుం డగా ప్రత్యేక వాహనంతో నీరు పోయిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 11:23 PM