ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూభారతి’పై అవగాహన పెంచుకోవాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 10:59 PM

రైతులందరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అపుడే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలి పారు.

గుండుమాల్‌ రైతువేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌, సిక్తా పట్నాయక్‌

కోస్గి రూరల్‌/కొత్తపల్లి/మద్దూర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రైతులందరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అపుడే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలి పారు. భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్నిరకాల హక్కులు కల్పించబడతాయన్నారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా శనివారం గుండుమాల్‌, కొత్తపల్లి, మద్దూర్‌ మండలాల్లో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ మండల కేంద్రంలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పదిరోజులుగా సదస్సులను ఏర్పాటు చేసి భూభారతి చట్టంపై రైతుల అనుమానాలను తీరుస్తున్నామన్నారు. దీని ద్వారా అన్నిరకాల భూసమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూధార్‌ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం కింది స్థాయి అధికారుల వద్ద తప్పు జరిగితే పైస్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. అలాగే ధరణిలో లేని అనేక వెసలుబాట్లు భూభారతిలో ఉన్నాయన్నారు.

మద్దూర్‌ మండలం దోరేపల్లిలో నిర్వహించిన భూభారతి సదస్సును కలెక్టర్‌ సందర్శించి రైతుల నుంచి అందుతున్న దరఖాస్తులను పరిశీలిం చారు. ఏఏ సమస్యపై దరఖాస్తులు వచ్చాయని అధికారులనడిగి తెలుసుకున్నారు. కొంతమంది రైతులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు వి వరించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, కోస్గి సింగిల్‌ విండో అధ్యక్షుడు భీంరెడ్డి, గుండుమాల్‌, కొత్తపల్లి తహసీల్దార్లు భాస్కరస్వామి, జయరాములు, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఏవో రేష్మారెడ్డి, కోస్గి మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మద్దూర్‌ మండలం దోరేపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆర్డీవో రాంచందర్‌, రెవెన్యూ అధికారులు వాసుదేవరావు, ప్రకాశ్‌, కమలాకర్‌, సర్వేయర్‌ అశోక్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 10:59 PM