బీచ్ హ్యాండ్‌బాల్‌లో ఆసిఫుల్లా మెరుపులు
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:36 PM
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు అంతర్జా తీయ, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.
- జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారుడు
- ఏషియన్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం
- 35 రాష్ట్ర స్థాయి, 5 జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తా
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు అంతర్జా తీయ, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారిలో ఆసిఫుల్లా బేగ్ ఒకరు. జిల్లాలోని భూ త్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన అతడు బీచ్ హ్యాండ్‌బాల్ క్రీడా పోటీ ల్లో అసమాన ప్రతిభ కనబరుస్తున్నాడు. గత నెల 6వ నుంచి 15 తేదీ వరకు ఒమన్ దేశంలోని మస్కట్‌లో జరిగిన ఏషియన్ బీచ్ హ్యాండ్ బాల్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి వ్యవసా యం చేస్తూ, అతడిని మహబూబ్‌నగర్‌లో చదివించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని శ్రీ కొండా బాపూజీ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హర్టికల్చ ర్ డిగ్రీ 2024 పూర్తి చేశాడు. మహబూబ్ నగర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలోనే పీఈటీ జియావుద్దీన్ ప్రోత్సా హంతో బీచ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఓనమాలు దిద్దుకొని రాణించాడు. ప్రతీ రోజు సాధన చేస్తూ జట్టులో లెఫ్ట్ బ్లాక్ స్థానంలో తిరుగులేని క్రీడాకారుడిగా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంత ర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
అంతర్జాతీయ స్థాయిలో రాణింపు
ఆసిఫుల్లా బీచ్ హ్యాండ్‌బాల్ క్రీడలో అద్భు తమైన ప్రతిభ చాటుతున్నాడు. ఇప్పటివరకు 35 రాష్ట్ర స్థాయి టోర్నీలు, మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థా న్‌లలో నిర్వహించిన 5 జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. మూడు నెలల క్రితం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నిర్వహించిన భారత బీచ్ హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఏప్రిల్ 21 నుంచి 30 వరకు నిర్వహించిన భారత హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 15 మందిలో తెలం గాణ నుంచి ఇద్దరు ఉన్నారు. వారిలో ఆసి ఫుల్లా కూడా చోటు దక్కించుకొని తొలిసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.
పీఈటీ ప్రోత్సాహంతోనే...
ఏషియన్ బీచ్ హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొన్న భారత జట్టులో చోటు దక్కడం నా అదృష్టం. మొదటి సారి అంతర్జాతీ య పోటీల్లో పాల్గొన్నాను. కోచ్, పీఈటీ జియావుద్దీన్ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగాను. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నాను. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాను.
- ఆసిఫుల్లాబేగ్, బీచ్‌హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు
Updated Date - Jun 24 , 2025 | 11:36 PM