ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కృత్రిమ మేధస్సు బోధన సజావుగా సాగాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:42 PM

పిల్లలకు బాల్యం నుంచే కంప్యూటర్‌ విద్యపై పట్టు సా ధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కృత్రిమ మేధస్సు శిక్షణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించా రు.

ఏఐ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల తరగతి గదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

పెద్దమందడి/ కొత్తకోట/వనపర్తి విద్యా విభాగం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు బాల్యం నుంచే కంప్యూటర్‌ విద్యపై పట్టు సా ధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కృత్రిమ మేధస్సు శిక్షణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించా రు. మంగళవారం పెద్దమందడి మండలంలోని మనిగిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు కొత్తకోట ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 3-5వ తరగతి విద్యార్థులకు నేర్పిస్తున్న కృత్రిమ మేధస్సు శిక్షణ తరగతులను కలెక్టర్‌ తనిఖీ చే శారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉన్న 11 పాఠశాల ల్లో 3-5వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌ శి క్షణ ఇస్తున్నట్లు డీఈవో తెలిపారు. అదే విధం గా 6 నుంచి 12వ తరగతి కేజీబీవీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఖాన్‌ అకాడమీ కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడే కొత్తగా నిర్మిస్తున్న పాఠశాల అదనపు గదుల భ వన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చూడా లని కాంట్రాక్టర్‌ కృష్ణారెడ్డిని సూచించారు. జిల్లా విద్యాధికారి మహమ్మద్‌ అబ్దుల్‌ ఘని, తహసీ ల్దార్‌ సరస్వతి, కొత్తకో ట తహసీల్దార్‌ వెంకటే శ్వర్లు, మునిసిపల్‌ కమి షనర్‌ సైదయ్య, ఏఎం వో మహానంది, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.

పాఠశాల భవన నిర్మాణాన్ని నాణ్యతగా నిర్మించండి

కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని నాణ్యవం తంగా నిర్మించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి కాం ట్రాక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం నిర్మాణం లోని పాఠశాల భవన సుముదాయాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అంతకుముందు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించా రు. కలెక్టర్‌ వెంట ఎంఈవో కృష్ణయ్య, కాంట్రా క్టర్‌ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ప్రవీణ్‌ కుమార్‌, రఘురామయ్య, నాయకులు నరేందర్‌రెడ్డి, సు భాష్‌ ఉన్నారు.

- మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో కృత్రిమ మేధస్సు విద్య అందించేందుకు ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాల, ఉన్నత పా ఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇచ్చి న కంప్యూటర్లను అన్నింటిని బాక్సుల్లోనే ఉంచ కుం డా బయటికి తీసి పాఠశాలలో నెలకొల్పి అందు బాటులోకి తీసుకురావాలని ఇందుకు వారం రో జుల గడువునిస్తున్నట్లు తెలిపారు. జిల్లా విద్యా అధికారి మహ్మద్‌ అబ్దుల్‌ ఘని, కోఆర్డినేటర్లు మహానంది, యుగంధర్‌, ఏసీజీ ఈ గణేష్‌, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:42 PM