ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీట్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN, Publish Date - May 02 , 2025 | 11:28 PM

జిల్లాలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ విజయేందిర బోయి, ఇతర అధికారులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు. పరీక్ష నిర్వహణకు 13 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 4,454 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి చీఫ్‌ సెక్రటరీ కె.రామక్రిష్ణ రావు, సంబంధిత కారుదర్శులతో కలిసి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఈ నెల 4న నిర్వహించనున్న నీట్‌ పరీక్ష ఏర్పా ట్లు, భూ భారతీ పథకం అమలు తదితర విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయేందిర బోయి మాట్లాడుతూ నీట్‌ పరీక్షల నిర్వహణపై రెండు సార్లు చీఫ్‌ సూపరింటెండెట్లు, అబ్జర్వర్‌లతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా అధికారులతో భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, గృహ నిర్మాణ అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపిక చేసిన మండలాల్లో ఈ నెల 5 నుంచి 20 వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించాలన్నారు. టీమ్‌లను ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలె క్టర్‌ ఎస్‌.మోహన్‌ రావు, ఆర్‌డీవో నవీన్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్‌, నీట్‌ నోడల్‌ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపా ల్‌ సురేందర్‌, ఎల్‌డీఎం భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:29 PM