ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హామీల అమలేదీ?

ABN, Publish Date - Jun 23 , 2025 | 10:47 PM

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకొని మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ

బీఆర్‌ఎస్‌ అడుగు జాడల్లోనే కాంగ్రెస్‌

ఎంపీ డీకే అరుణ

మాచన్‌పల్లిలో వికసిత్‌భారత్‌ సంకల్ప సభ

మహబూబ్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకొని మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు రూ.4,000 ఇస్తామని, ఇళ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ మోదీ నాయకత్వంలో బలపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందన్నారు. పేద ప్రజలు ఆకలితో ఉండకుండా ప్రతీ పేదవాడికి మూడు నెలల కోటా సన్న బియ్యం ముందే అందించిందని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని 10 నిర్మించారని, అవి కూడా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. శిఽథిలావస్థకు చేరాయన్నారు. బీఆర్‌ఎస్‌ అడుగు జాడల్లోనే కాగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే ప్రజలు నమ్ముతారని, కాంగ్రెస్‌ పని అయిపోయిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు జితేందర్‌కుమార్‌, నాయకులు పద్మజారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, పాండు రంగారెడ్డి, జయశ్రీ, రాజు గౌడ్‌, కోస్గి సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 10:47 PM