దరఖాస్తులు పరిష్కరించాలి
ABN, Publish Date - May 13 , 2025 | 11:06 PM
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను భూ భారతి ఆర్వోఆర్ చట్టం ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- అధికారులను ఆదేశించిన కలెక్టర్ విజయేందిర బోయి
మూసాపేట, మే 13 (ఆంధజ్యోతి) : రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను భూ భారతి ఆర్వోఆర్ చట్టం ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని సంకల మద్ది (మూసాపేట), కనకాపూర్ రెవన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. కనకాపూర్‌లో అదనపు కలెక్టర్ మోహన్‌రావుతో కలిసి కలెక్టర్ పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు 13 గ్రామాల్లో నిర్వహించగా, 562 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులకు వివిధ కారణాలతో హాజరుకాలేని వారు నేడు 14న తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోగలరని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దర ఖాస్తులను ఉచితంగా అందజేస్తారని, రైతులు, ప్రజలు దరఖాస్తులు నింపి కొత్త పాతపాస్ పుస్తకం, ఆర్వోఆర్, సంబంధిత డ్యాకుమెంట్‌లు జ తపరిచి అందజేయాలన్నారు. మూసాపేటను పైలెట్ ప్రాజెక్టుగా చేసినందుకు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు తహసీ ల్దార్ రాజును సన్మానించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్, నాయకులు రాంచందర్, ప్రతాఫ్‌రెడ్డి, కృష్ణయ్య, లక్ష్మికాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:06 PM