ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

ABN, Publish Date - May 25 , 2025 | 11:24 PM

జడ్చర్ల మునిసిపాలిటీలో అక్రమ నిర్మాణాల బాగోతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

జడ్చర్లలో అనుమతి లేకుండానే సెల్లార్‌తో నిర్మించిన నాలుగు అంతస్థుల భవనం

- వివాదాలుగా మారుతున్న అనుమతులు లేని నిర్మాణాలు

- చర్యలు తీసుకోకపోవడంతో అభాసుపాలవుతున్న అధికారులు

జడ్చర్ల, మే 25 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల మునిసిపాలిటీలో అక్రమ నిర్మాణాల బాగోతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సెట్‌ బ్యాక్‌ లేకుండానే జరుగుతున్న నిర్మాణాలతో పాటు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలో తీసుకున్న అనుమతుల ఆధారంగానే నిర్మాణాలు చేపడుతున్నామంటూ కొందరు వెల్లడిస్తుండగా, పాతభవనాల స్థానంలో రెన్యువేషన్‌ చేస్తున్నామంటూ మరికొందరు భవన యజమానులు వెల్లడిస్తున్నారు. అనుమతి పొందిన వాటికంటే మరికొందరు అదనంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. జడ్చర్ల మునిసిపాలిటీలో సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదని మునిసిపల్‌ అధికారులు వెల్లడిస్తున్నా.. ఇప్పటికే పదుల సంఖ్యలో సెల్లార్‌ నిర్మాణాలు పూర్తయిన భవనాలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలకే అనుమతులు తీసుకుని, ఒకటి లేదా రెండు షటర్లతో పాటు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. 75 గజాల లోపు నిర్మాణాలకు కేవలం రూ.1 చెల్లించి ఇళ్ల నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధనలు ఉండగా అందుకు భిన్నంగా అంతే స్థలంలో కమర్షియల్‌ నిర్మాణాలు సాగిస్తున్నారు.

జడ్చర్ల మునిసిపాలిటీలో ఇటీవల కొన్ని నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. 167వ జాతీయ రహదారి నిర్మాణంలో జడ్చర్ల క్రాస్‌రోడ్డు నుంచి కల్వకుర్తి రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా నిబంధనల మేరకు లోబడి భవనాలను కూల్చివేశారు. నిబంధనల ప్రకారం 50ఫీట్ల మేర రోడ్డు వెడల్పు చేపట్టాల్సి ఉండగా, ఈ మేరకు రోడ్డు నిర్మాణం చేపడితే మజీదు, చర్చి, ఆలయం కూల్చివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జడ్చర్ల క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరానగర్‌ వరకు అక్కడి పరిస్థితిని బట్టి కొంత మేర తగ్గించారు. దీంతో కొన్ని భవనాలు పాక్షికంగా కూల్చివేయగా స్థలం మిగిలింది. ఇలాంటి స్థలంలోనే చేపట్టిన నిర్మాణాలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. కొద్దిపాటి స్థలంలో నిర్మించిన కమర్షియల్‌ నిర్మాణాలకు సంబంధించిన షటర్ల తాళాలు మునిసిపల్‌ అధికారులు తీసుకోవడంతో భవన నిర్మాణ యజమానులు, మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న స్థలాల్లో ఏకంగా పెద్ద, పెద్ద షెడ్‌ల నిర్మాణాలు చేపట్టారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా మార్బుల్‌ స్టోన్స్‌ విక్రయించే దుకాణాలు విరివిగా వెలిశాయి.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం

జడ్చర్ల మునిసిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై కొందరికి నోటీసులు జారీ చేశాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. అక్రమ, అనుమతులు లేని నిర్మాణాలపై ఉపేక్షించేది లేదు.

- లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - May 25 , 2025 | 11:24 PM