ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన అంగన్‌వాడీలు
ABN, Publish Date - May 01 , 2025 | 11:43 PM
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఇందిరమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని శాలు వా, పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞత లు తెలిపారు.
గద్వాల న్యూటౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఇందిరమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని శాలు వా, పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞత లు తెలిపారు. అంగన్‌వాడీ పాఠశాలలకు మే నెలంతా సెలవులు ప్రకటించడం తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 30ఏళ్ల చరిత్రలో మొదటిసారి చిన్నపిల్ల ల దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ సెలవులు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియ న్ కార్యదర్శి వెంకటరమమ్మ, సభ్యులు శాంతి, లక్ష్మి, రేణుక, శ్రీదేవి, సమయిర బేగం, శోభ తదితరులు ఉన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:43 PM